ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి ఉన్నంత క్రేజ్ తో దూసుకుపోతున్నాడు రజినీకాంత్. ఇప్పటికీ ఎప్పటికీ తమిళనాడు ఆరాధ్య దైవం అనే మాటకు నిలువెత్తు రూపం రజనీకాంత్. అయితే రజనీకాంత్ మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఒక స్లమ్ ఏరియాలో 20 రూపాయలతో ఒక గదిలో అద్దెకి ఉండేవాడట. ఇక ఆ తరువాత నుండి మంచి మంచి సినిమాలలో స్టార్ హీరోగా నటించిన అంచలంచలుగా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా ఒక్కొక్క సినిమాకి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతుంది 

అంతే కాదు రజనీకాంత్ సినిమా అంటే చాలామంది నిర్మాతలు కళ్ళు మూసుకొని చేస్తారు. ఈయన సినిమా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లను సాధిస్తాయి. అయితే ఒకప్పుడు రజనీకాంత్ ఆకతాయిలా ఉండేవారు. దాని అనంతరం రాను రాను రజనీకాంత్ ని చాలామంది దేవుడిగా చూడడం మొదలుపెట్టారు. దాని తర్వాత నుండి రజనీకాంత్ ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకొని మారిపోయాడు ఆయన ముందు ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా చూడలేకపోయేవాడు రజనీకాంత్. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .

ఇక అదేంటంటే రజనీకాంత్ ఇంటికి ఓ స్టార్ హీరోయిన్ రమాప్రభ వెళ్లడం జరిగిందట. ఇక ఆ సమయంలో రమాప్రభ శరత్ కుమార్ తో విడిపోయిన అనంతరం ఆమె దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొ ట్టుకోవడం జరిగిందట. ఇక అలాంటి దిన స్థితిలో రజనీకాంత్ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో రమాప్రభని చూసినా రజినీకాంత్ నీ గురించి నాకు అవసరం లేదు. నీ తెలివి తక్కువ తనం వల్ల నీ డబ్బంతా పోగొట్టుకున్నావు అని తిట్టడం దాని అనంతరం వంద రూపాయల కుప్పను రమాప్రభ కి ఇవ్వడం జరిగిందట. ఆ సమయంలో ఆ డబ్బు 40 వేల రూపాయలు. దీంతో ఆమె చాలా ఆనంద పడిందట రజనీకాంత్ దగ్గరికి సహాయం కోసం వచ్చిన ఏ ఒక్కరిని కూడా రజనీకాంత్ వట్టి చేతులతో పంపకుండా ఆయన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి పంపుతూ ఉంటాడు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: