
హీరో నాని పుట్టినరోజు వచ్చింది అంటే చాలు నిర్మాత బోయినపల్లి వెంకట్ లక్షలు ఖర్చుపెట్టి పత్రికలలో ప్రకటనలు కూడ ఇస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా జరిగిన అల్లు అర్జున్ పుట్టినరోజునాడు నిర్మాత విశ్వ ప్రసాద్ అమెరికాలో బన్నీకి శుభాకాంక్షలు తెలిపిన విధానం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. పీపుల్స్ మీడియా సంస్థ అధినేత అయిన ఇతడు అమెరికాకు వచ్చిన టాప్ హీరోలు అందరికీ ఆతిధ్యం ఇవ్వడం ఒక హాబీగా పెట్టుకుని అందులో చాల గౌరవాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు.
ఇప్పటికే అతడు సినిమా తీస్తే డేట్స్ ఇవ్వడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ లు రెడీగా ఉన్నారు అని అంటారు. ఈమధ్య జరిగిన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక అద్దె విమానం తీసుకుని దానికి హ్యాపీ బర్త్ డే టు అల్లు అర్జున్ అంటూ ఒక ఫ్లాగ్ ను కట్టి ఆకాశంలో చక్కర్లు కొట్టించాడట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇలా చేసినందుకు కాను ఇతడికి లక్షలలో ఖర్చు అయింది అని అంటున్నారు. ఒకప్పుడు హీరోలు తమ వద్దకు వచ్చే అభిమానులు నిర్మాతలతో ఎక్కువ ఖర్చులు పెట్టకండి అంటూ సలహాలు ఇచ్చే వారని చెపుతారు. అయితే ఇప్పుడు టాప్ హీరోలు తమ నిర్మాతలు ఎంత ఖర్చు పెడితే అని ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది..