టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సదా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ సినిమాల్లో ఊహించని పాపులారిటీని దక్కించుకుంది ఈమె. ఇప్పటికీ కూడా దక్షిణాది ఆడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ గా ఉంటూ పలు బుల్లితెర షోలలో చేస్తూ బిజీగా ఉంది సదా. అయితే సదా తండ్రి ఒక డాక్టర్ ఇక ఆమె తల్లి ఒక బ్యాంకు ఉద్యోగిని. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో మొదటి సారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది సదా. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇక ఆ సినిమా తర్వాత అపరిచితుడు సినిమాతో ఊహించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సదా. ఇక ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఆ సినిమా తర్వాత సదా కి వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి.కానీ ఆ సినిమాలన్నీ కూడా ఊహించని విధంగా రివర్స్ అయ్యాయి .అయితే గత కొంతకాలంగా సదా సినిమాలకు దూరంగా ఉంది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది సదా. ఇటీవల హలో వరల్డ్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఇక ఈ సంగతి పక్కన పెడితే సదా తన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రతికంగా చెప్పక్కర్లేదు .

నాలుగుపదుల వయసు వచ్చినప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది సదా. ఇంత వయసు మీద పడినప్పటికీ పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే నోరు విప్పదు సదా. అయితే తాజాగా ఇప్పుడు సదా చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో తెగవారిలో అవుతున్నాయి. మన జీవితంలో కొందరిని దూరంగానే ఉంచాలి జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్లు కాస్త వైరల్ గా మారాయి. మొత్తానికి సదా చేసిన కామెంట్ల వల్ల సభకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: