సత్యం రాజేష్ , గెటప్ శ్రీను బాలాదిత్య సాహితీ దాసరి ప్రధాన పాత్రలో నటిచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమన్లు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ను మరింత ఆసక్తికరంగా మలిచేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది.
గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ పనులు బిజీగా ఉన్న చిత్ర బృందం పలు రకాల అప్డేట్లను సైతం తెలియజేస్తూనే ఉంది.. పొలిమేర సినిమాలో నటించిన నటీనటులతో ఈ సినిమాని శ్రీకృష్ణ క్రియేషన్ బ్యానర్ పై గణబాబు సమర్పణలు నిర్మిస్తున్నారు. తాజాగా మా ఊరి పొలిమేర-2 టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ ని హీరో వరుణ్ తేజ్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టీజర్లో ఎక్కువగా కథ అర్థం అయ్యేలా చూపించలేదు.కానీ ఇందులో కూడా చేతబడులు ఉంటాయన్నట్లుగా పలు రకాల క్యారెక్టర్ లను చూపించడం జరిగింది.



ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా భయాందోళనతో కలిగించేలా కనిపిస్తోంది.. చివరిలో చంపితే తప్పుకాని బలి ఇస్తే తప్పేంటి అనే డైలాగ్ బాగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నటుడు సత్యం చివరిలో చేతబడి చేస్తూ రక్తంతో అభిషేకం చేసుకోవడం వంటివి చూపించడం జరిగింది దీంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది.. త్వరలోనే ఈ సినిమానీ విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీడీలో కాకుండా ఈసారి థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: