సాధారణంగా స్టార్ హీరోయిన్ అవ్వడం అంటే చాలా కష్టం. స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆ స్టేటస్ ను మైంటైన్ చేయడం మరింత కష్టం. కావాలి అంటే దీనికి నిలువెత్తు నిదర్శనంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తున్న ఏకైక హీరోయిన్.శ్రీ లీల అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. అదేంటి గత కొన్ని నెలలుగా ఈ తొమ్మిది నంబర్ చెబుతున్నారు అని ఆలోచిస్తున్నారా.. అవును తన సినిమాల సంఖ్య అక్కడితో ఆగిపోయింది కాబట్టి తొమ్మిది అని నంబర్ చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు శ్రీలీలకి అదే సమస్య వచ్చి పడినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈమె దాని తర్వాత ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఏమి వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా అంతకు ముందు చేసిన సినిమాలతో ఇప్పుడు కొత్త సినిమాలు సైతం ఓకే చేయడంతో తనకి మరింత ఇబ్బంది అవుతున్నట్లుగా తెలుస్తోంది. చేసిన సినిమాల్లో ఒకటి నెలాఖరుకు రిలీజ్ అవుతుండగా మరొకటి దసరాకు రిలీజ్ అవుతుంది మిగిలినవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి పూర్తవుతాయి అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా ఈనెలఖరికి రాబోతోంది. బాలకృష్ణ భగవత్ కేసరి వచ్చే నెలలో వస్తుంది.

దాని తర్వాత నెలలో వైష్ణవ్ హీరోగా నటించిన ఆదికేశవ రాబోతుంది. మిగిలిన సినిమాలు ఈ మూడు సినిమాలు తర్వాత వస్తున్నాయి. ఇక మహేష్ బాబు గుంటూరు కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాది భగత్ సింగ్ వంటి సినిమాలతో పాటు మిగిలిన సినిమాలు కూడా అప్పుడే రాబోతున్నాయి. దీంతో కొత్త సినిమాలు చేయడానికి తనకి డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు అని తెలుస్తుంది. ఈ కారణంగా శ్రీ లీల వరుస సినిమాలు చేయడం ఆపేయాలి అన్న నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ లెక్కల చిక్కులు కారణంగానే రవితేజ గోపీచంద్ మలినేని సినిమాలను వదులుకుంది అన్న సమాచారం వినబడుతోంది. దానితోపాటు విజయ్ దేవరకొండ సినిమా నుండి కూడా ఈ ముద్దుగుమ్మ తప్పుకుంది అని అంటున్నారు. మరొక యంగ్ హీరో సినిమా నుండి కూడా శ్రీ లీలా తప్పుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలా ఇప్పుడు శ్రీ లీలా స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకోవడానికి సినిమాలను రిజెక్ట్ చేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: