తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు వెంకటేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఓ గ్రాండ్ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ తోనే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో కనుమరుగైన మల్టీ స్టారర్ జోనర్ మూవీ లు కూడా తెరపైకి వచ్చాయి.

మూవీ తర్వాత మహేష్ తో శ్రీకాంత్ అడ్డాల "బ్రహ్మోత్సవం" అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు "పెద్దకాపు 1" అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా న్యూ సెప్టెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ దర్శకుడు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ... నేను మహేష్ బాబు తో తెరకెక్కించిన బ్రహ్మోత్సవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత కొంత కాలానికి మహేష్ గారిని కలిసినప్పుడు ఆయన మనం బాగున్నాం కదా సార్ ... దానిదేముంది అప్పుడప్పుడు అలా జరుగుతుంది అన్నారు అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇకపోతే "పెదకాపు 1" మూవీ తో శ్రీకాంత్ అడ్డాల ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: