యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ఎక్కువ శాతం వాటర్ లో ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో అనేక యాక్షన్ సన్నివేశాలు కూడా వాటర్ పై ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దానితో ఎన్టీఆర్మూవీ లోని అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాల కోసం ముంబై లో కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకొని ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో ఇప్పటికే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంస్థ ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఏకంగా 80 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: