
డిజిటల్ ప్రపంచంలోకి మొదటిసారి అడుగు పెట్టబోతున్న ఓంకార్ తాజాగా మ్యాన్షన్ -24 అనే వెబ్ సిరీస్ ని దర్శకత్వం వహించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్ల స్ట్రిమ్మింగ్ కాబోతోంది. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది ఓంకార్ ఇందులో కూడా తన మార్కుకి తగ్గట్టుగానే హర్రర్ సన్నివేశాలతో పాటు భయపెట్టే సన్నివేశాలను కూడా ఎలివేంట్ అద్భుతంగా చేశారు .ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఒక బంగ్లాలో వెళ్లిన తండ్రి కనిపించకుండా పోవడంతో ఆయన కూతురు అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తన తండ్రిని కనిపెట్టడం కోసం వెతుకుతూ ఉంటుంది.
అలా తన తండ్రి తప్పిపోయిన ఒక బూతు బంగ్లా మ్యాన్షన్ లోకి వెళ్లినవారు ఎవరు కూడా తిరిగిరారు అనే పాయింట్ తో ఈ సినిమాని హైలెట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని హర్రర్ సన్నివేశాలు కూడా ట్రైలర్లు అద్భుతంగా చూపించారు ఓంకారం. ఇందులో సత్యరాజ్ ,వరలక్ష్మి శరత్ కుమార్, ఆవికాగోర్, బిందు మాధవి, నందు తెలుగు తమిళంలో దాదాపుగా 20 మంది ఆర్టిస్టుల వరకు నటించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.