యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరడానికి ఆయనకు ఆహ్వానం అందింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించడమే కాదు ఆస్కార్లో కూడా మెరిసింది. ఇక ఈ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అటు రామ్ చరణ్ కి కూడా అంతర్జాతీయంగా ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి నాటు నాటు పాటకు ఎక్కువ మార్కులు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా అకాడమీ తన యాక్టర్స్ బ్రాంచ్ లో కొత్త సభ్యులను సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా.. ఈ కొత్త సభ్యుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు కావడం విశేషం. ఇక ఆస్కార్ విన్నర్ కె హుయ్ క్వాన్, మర్షా స్టీఫనీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ తోపాటు ఎన్టీ రామారావు జూనియర్ పేరును అకాడమీ ప్రకటించింది.  ఇక వీళ్ళందరికీ కూడా యాక్టర్స్ బ్రాంచ్ లోకి స్వాగతం చెబుతూ ఇంస్టాగ్రామ్ లో అకాడమీ పోస్ట్ చేయడం గమనార్హం. ఇకపోతే ఈ ఐదుగురు నటీనటుల ప్రతిభ వారి అంకిత భావాన్ని సంస్థ కొనియాడింది.

ఇకపోతే వీరంతా కూడా ఆస్కార్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆహ్వానం మేరకు యాక్టర్స్ బ్రాంచ్ లో సభ్యత్వం పొందుతారు. అలాగే మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో యాక్టివ్ గా ఉన్నవాళ్ళకు వెండితెరపై ప్రతిభను చాటుతున్న వాళ్లలో కొంతమందికి మాత్రమే ఈ సభ్యత్వానికి ఆహ్వానాలు పంపించారు. ఇందులో సభ్యత్వం పొందాలి అంటే మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో డిస్టిక్షన్ సాధించి ఉండాలని కూడా అకాడమీ స్పష్టం చేసింది. ఇక యాక్టర్స్ బ్రాంచ్ లో స్థానం పొందాలంటే ఆ నటుడు కనీసం మూడు థియేటర్ ఫీచర్ ఫిలింలో నటించి ఉండాలని రూల్ కూడా పెట్టింది .మొత్తానికైతే ఎన్టీఆర్ అకాడమీలో స్థానం సంపాదించుకోవడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: