కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య  కంగువ సినిమాతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదల కాకముందే సూర్య43 అప్‌డేట్స్‌ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఆకాశం నీ హద్దురా ఫేం  సుధాకొంగరతో ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు సూర్య. ఇక సూర్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది. సూర్య 43 అనౌన్స్‌మెంట్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూర్య.సుధా కొంగరతో మళ్లీ కలిసి పనిచేస్తుండటం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. ఇది జీవీ ప్రకాశ్‌ కుమార్ 100వ ప్రాజెక్ట్‌. సోదరుడు దుల్కర్ సల్మాన్‌, టాలెంటెడ్‌ యాక్టర్లు విజయ్ వర్మ ఇంకా నజ్రియాతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా. హోంబ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో స్పెషల్ సినిమాను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు సూర్య. ఖాళీ సీసా, టేప్‌ రికార్డర్‌, మైక్‌, మంటలు ఇంకా గన్ ఇలా డిఫరెంట్‌ ప్రాపర్టీస్‌ను అనౌన్స్‌మెంట్‌ వీడియోలో మనం చూడొచ్చు.


ఈ సినిమాకి "Purananooru" అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. తాజా వీడియో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఇది బయోపిక్ కాదని అయితే ఈ సినిమా కూడా నిజ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల స్పూర్తితో సూరారై పోట్రును మించి ఇంకా భారీ స్థాయిలో ఉండబోతుందని  తెలియజేశారు డైరెక్టర్ సుధా కొంగర.ఇక సూర్య హీరోగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్‌ కంగువ నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో బాగా ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంగువ ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్‌లలో ఏకంగా 10 భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: