
అయితే ఈ వారం విడుదలైన సినిమాలలో వాలెంటైన్స్ నైట్ అనే మూవీ కూడా ఒకటి ఈ సినిమా దాదాపుగా సంవత్సరం తర్వాత ఓటీటి లో స్ట్రిమింగ్ అయింది. కానీ ఈ సినిమా 2023 వ సంవత్సరం జనవరి 26వ తేదీన విడుదల కాగా కథ బాగుండడంతో పర్వాలేదు అనిపించుకుంది. ఈటీవీ యాప్ లో ఈ నెల 15వ తేదీన స్ట్రిమింగ్ కాగా అదే రోజు ఐ బొమ్మ లో కూడా స్ట్రిమింగ్ అయ్యిందట. అలాగే వీటితో పాటు ఓటీటి కంటెంట్లు విడుదలైన ఏ ఒక్క సినిమా అయినా సరే కచ్చితంగా ఐబొమ్మలో ఒరిజినల్ ప్రింట్ తో రావడంతో ఎక్కువగా వీటినే చూస్తున్నారు.
నా సామి రంగ, గుంటూరు కారం, సైంధవ, భామ కలాపం-2 ఇతరత్రా వెబ్ సిరీస్ సినిమాలు కూడా కేవలం కొన్ని నిమిషాలలోనే ఐ బొమ్మలు స్ట్రిమింగ్ అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఓటీటి ప్లాట్ఫారం ధరలు పెంచేస్తే మటుకు వాటిని ఉపయోగించే వారి సంఖ్య రోజుకి తగ్గిపోతుందని ఇలాంటి తర్డ్ యాప్స్ ఉపయోగించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంటుందంటూ సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. థియేటర్లో విడుదలైన కొన్ని గంటలకే సినిమాలు కూడా చూసేలా ఉన్నాయి.ఏది ఏమైనా ఐ బొమ్మ లో చాలామంది సినిమాలను వీక్షిస్తున్నారని చెప్పవచ్చు.