సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించేవన్నీ నిజాలు కావు అన్న విషయం తెలిసిందే. తెరి మీద నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించే నటీనటులందరూ కూడా తెర వెనుక  మాత్రం ఊహించని కష్టాలను ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఇక ముందుకు సాగాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కెరియర్ తొలినాళ్లలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే ఇలా తమ పర్సనల్ విషయాల గురించి అభిమానులతో చెప్పుకోవడానికి పెద్దగా సెలబ్రిటీలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇక అందరూ హీరో హీరోయిన్లు కెరియర్ తొలినాళ్లల్లో ఎదురైన చేదు అనుభవాలను అన్నింటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కత్రినా కైఫ్ సైతం కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఎంతోమంది మేకర్స్ తనను సూటిపోటి మాటలు అనేవారు అంటూ ఇటీవల చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. నేను కెరియర్ లో సక్సెస్ కాలేనని ఎంతోమంది నా మొహం మీదే చెప్పేవారు. ఇక టాలీవుడ్ లో వెంకటేష్ తో నటించిన మల్లీశ్వరి షూటింగ్లో ఓ పాట చేస్తున్నప్పుడు.. ఈ అమ్మాయి డాన్స్ చేయలేదు అంటూ ఎవరో మైక్ లో అన్నారు. ఆ మాట ఎంతగానో బాధించింది. అయితే ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి   కానీ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగాను అంటూ కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.


 కాగా ఈ అమ్ముడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అటు దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇక తన అందం అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పటికీ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది కత్రినా కైఫ్. ఇక ఎంతోమంది హీరోలతో డేటింగ్ రిలేషన్ షిప్స్ పెట్టుకొని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: