టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి తేజ సజ్జ తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సూపర్ హీరో జోనర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో తేజ కి అక్క పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలం లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను "జీ 5" సంస్థ వారు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" విడుదలకి సంబంధించి అనేక వార్తలు వచ్చిన ఈ సినిమా మాత్రం "ఓ టి టి" లోకి చాలా కాలం ఎంట్రీ ఇవ్వలేదు.

ఇకపోతే ఎట్ట కేలకు ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ప్రస్తుతం జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లోను ... హిందీ వర్షన్ జియో సినిమా "ఓ టి టి" లోను స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: