టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పనులన్నింటినీ ఈ మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఆ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ రోజు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ ... వేదిక ను ఖరారు చేశారు. ఈ రోజు అనగా మార్చి 27 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "ఐ టి సి" కోహినూర్ ... హైదరాబాద్ లో ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ మూవీ బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: