మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి "జరగండి" అంటూ సాగే సాంగ్ చాలా రోజుల క్రితమే లీక్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లీక్ అయిన తర్వాత ఆఫీషియల్ గా ఈ మూవీ నుండి ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ఈ  చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ సినిమా లోని ఈ పాటను విడుదల చేయలేదు. ఇకపోతే ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఈ రోజు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని జరగండి అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది.

ఇకపోతే ఈ మూవీ లోని ఈ సాంగ్ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టు గానే ఈ సాంగ్ బాగుండడం అందులో విజువల్స్ కూడా సూపర్ గా ఉండడంతో విడుదల అయిన అతి తక్కువ సమయం లోనే ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ లోని ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయి లో కట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: