
ఇప్పుడు తాజాగా తాప్సి, మథియాస్ బోయ్ పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు రావడం జరిగింది.. ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులలో తలుక్ మని మెరిసింది తాప్సి.. ఎరుపు రంగు సాంప్రదాయమైన దుస్తులలో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని డాన్స్ వేస్తూ మరి పందిరిలోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.. పెళ్లికూతురుగా యమ జోష్ గా కనిపిస్తోంది.. తన కాబోయే భర్త స్టేజ్ మీద పిలవగానే వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది తాప్సి..
తాప్సి 2013లో మథియాస్ బోయ్ రిలేషన్లో ఉన్నట్లుగా వెల్లడించారు. దాదాపుగా పదేళ్ల తర్వాత వీరి ప్రేమ బంధం ఇటీవల వెల్లడించారు. ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం గా మార్చారు.. ప్రస్తుతం తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. తాప్సి టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది ఇటీవల కాలంలో తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. సోషల్ మీడియాలో అభిమానుల సైతం తాప్సికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. తన పెళ్లిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.