టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ రేపు అనగా ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేసింది. అందులో భాగంగా ఈ సినిమాకు భారీ మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 4.5 కోట్లు ... ఆంధ్ర ఏరియాలో 17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 34.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్ సీస్ లో 5.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరీలోకి దిగబోతోంది.

సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd