ఓటీటీలో వచ్చే వరుస వెబ్ సిరీస్ లకు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులు  వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు..రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్ ఆడియన్స్ ను అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరినీ మెప్పిస్తోన్న  తెలుగు వెబ్ సిరీస్ "సేవ్ ది టైగర్స్" సీజన్ 2..రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో  నిలిచింది. దీనిపై సేవ్ ది టైగర్స్ షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువైంది" అని మహి వి రాఘవ్ తెలిపారు.

ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. అంతేకాకుండా సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌ చేసే అవకాశం ఉందని వారు తెలియజేసారు.అందులో భాగంగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు.సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళుతుంది. ఇదే సందర్భంలో టాలెంటెడ్ రైటర్స్,ఫిల్మ్ మేకర్స్‌ వారి స్క్రిప్ట్స్ ను మరియు ఆలోచనలను తమకు పంపాలని మహి వి. రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే సదరు రైటర్ మరియు ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని వారు పేర్కొన్నారు.ఇదిలా ఉంటే మహి వి రాఘవ్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2కు రిలీజ్ సమయంలో సీజన్ 3కి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన జీవితాల్లో సరదాగా జరిగే సందర్భాలను, పాత్రల వారీగా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి ఈ సిరీస్ పుట్టిందని ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: