కార్తికేయ, ఇశ్వర్యా మెనన్ జంటగా నటించిన 'భజే వాయు వేగం' సినిమా మే 31న రిలీజ్ కానుంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీని యువీ కాన్సెప్ట్స్ నిర్మిస్తుండగా, యువీ క్రియేషన్స్ సమర్పిస్తోంది.ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టు కొట్టాలని కార్తికేయ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ హడావుడి కూడా మొదలైంది. rx100 తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ చూడలేకపోతున్న కార్తికేయకు ఈ సినిమా హిట్టవ్వడం ఖచ్చితంగా చాలా ముఖ్యం.ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. భారీ డబ్బుతో ఎస్కేప్ అయిన వ్యక్తిని వెతుకుతున్న దృశ్యాలతో ప్రారంభమయ్యే ట్రైలర్ లో ఒక డిఫరెంట్ పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తున్నారు. ఇందులో రవి శంకర్ పాత్ర భయపెడుతూ ఉండగా హీరోకు తమ్ముడు పాత్రలో రాహుల్ టైసన్ నటించారు. హీరోయిన్ పాత్రలో ఇశ్వర్యా మెనన్ కూడా ట్రైలర్ లో బాగానే మెరిసింది.


తండ్రి ఆపరేషన్ కోసం ఎలాగైనా డబ్బు తీసుకు రావాలనే ఆలోచనతో హీరో పెద్ద క్రైమ్ కు పాల్పడతాడని తెలుస్తోంది. ఇక రౌడీలు అతన్ని వెంటాడడం మరోవైపు పోలీసుల సమస్యలు ఇలా అన్ని రకాల చాలెంజ్ ల మధ్యలో హీరో తండ్రిని ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్ ట్రైలర్ లో హైలెట్ అవుతోంది. ఇక రాహుల్ టైసన్ పాత్ర చివరలో చెప్పిన డైలాగ్ తో సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బలంగా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది.ఇక ఈ సినిమా పూర్తిగా వేగవంతంగా సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సమకాలీన ఎడ్జ్ ఉన్న సినిమాల్లో ఉండే అన్ని కొత్త అంశాలు ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్లో కూడా ఉన్నాయి. ఈ మూవీకి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర ఒక ఎమోషనల్ బ్యాక్‌స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కపిల్ కుమార్ అందించగా ఇంకా పాటలను రధన్ స్వరపరిచారు.పైగా ఈ మూవీ ప్రమోషన్స్ లలో లెజెండరీ నటులు చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక హ్యాండ్ వేయడంతో కూడా మరింత బజ్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: