
నిజానికి మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు అని తెలియగానే అందరూ మహేష్ బాబు ఇంత ప్రెజర్ తట్టుకోగలడా..? ఆయన ఎప్పుడూ కాంట్రవర్షియల్ లేకుండా సాఫీగా తన లైఫ్ వెళ్లిపోవాలని చూస్తాడు .. ఎక్కువ ప్రెజర్ తీసుకోడు . మరి రాజమౌళి ఆయన వర్క్ ప్రెజర్ తట్టుకోగలడా ..? అంటూ అంతా అనుకున్నారు . అయితే రాజమౌళి మాత్రం అందరి హీరోల విషయంలో ఒకలా మహేష్ బాబు విషయంలో ఒకలా ట్రీట్ చేస్తున్నాడు అంటున్నారు జనాలు .
సాధారణంగా రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో అయిన నటించాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి . అది ఆల్ మోస్ట్ అందరికి తెలుసు. కానీ వాటిల్లో కొన్ని మాత్రం మహేష్ బాబుకి మినహాయింపు ఇచ్చేశాడు. బయటకు స్వేచ్ఛగా తిరిగే ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు ఆయన ఫొటోస్ రివిల్ల్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రవితేజ - ప్రభాస్ - చరణ్ -తారక్ లు పడినంత కష్టం రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు పడడం లేదు అని .. నిజంగానే మహేష్ బాబు వెరీ వెరీ లక్కీ ఫెలో అని మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!