సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కూసింత హద్దులు మీరిపోతున్నారు . బోల్డ్ కామెంట్స్ పక్కన పెడితే హద్దులు లేకుండా హద్దులు మీరు పోయి హద్దులు దాటిన విధంగానే లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు ఎలా మారుమ్రోగిపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అంతకుముందు కూడా విజయ్ దేవరకొండ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కానీ ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ పేరుపై కూసింత నెగెటివిటీ ఏర్పడింది . విజయ్ దేవరకొండ కూడా నెగిటివిటిని సినిమాల పరంగానే పాజిటివిటీగా మార్చుకోవాలి అంటూ బాగా ట్రై చేస్తున్నారు.


ఆయన కమిట్ అయిన సినిమాలను హిట్టయ్యే విధంగా కష్టపడుతున్నారు . ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ సూర్య నటించిన "రెట్రో" మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు విజయ్ దేవరకొండ . ఏదైనా ఈవెంట్ కి వస్తున్నాడు అంటే కచ్చితంగా ఆయన ఫ్యాన్స్ కాస్త హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు . ఆయన స్పీచ్ అలా ఉంటుంది . తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ బాగా ఇస్తాడు అన్న పేరు ఉంది. ఆయన తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ మాత్రమే . చాలా స్టైలిష్ గా వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా గురించి కన్నా కూడా జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ఎక్కువగా మాట్లాడారు .



ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా ఇంత ఓపెన్ గా ఇంత డేర్ గా మాట్లాడిన వారు లేరు." ఆ పాకిస్తానీ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ లేదు అని .. అసలు ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని పనికిమాలిన దాడులకు దిగే వారు కాదు అని.. ఎవడు ఎంత హడావిడి చేసిన డోంట్ కేర్ ..కాశ్మీర్ ఇండియాదే అంటూ స్పీచ్ ఇచ్చారు ". అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్క ఇండియన్ బాగా కనెక్ట్ అయిపోయారు. కొంతమంది విజయ్ దేవరకొండ మాటలను చాలా పాజిటివ్ గా తీసుకొని ఆయన మాట్లాడిన మాటల వీడియోను ట్రెండ్ చేస్తుంటే .. మరి కొంత మంది మాత్రం మిగతా హీరోలు ఏం చేస్తున్నారు? సినిమాల కోసం రెమ్యూనరేషన్ తీసుకొని ప్రైవేట్ జెట్ లైన్స్ లో ఫ్యామిలీతో అటు ఇటు తిరుగుతూనే ఉంటారా ..?ఇలాంటి సందర్భంలో స్పందించరా..? మీరు ఇండియన్స్ కాదా..? పొయి విజయ్ దేవరకొండ సంకనాకండి అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల తాలుకా వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: