- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

క్రేజీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ సినిమాల్లో యాక్షన్ , హీరో ఎలివేషన్లు తప్ప హీరోయిన్ వారి గ్లామర్ అసలు పట్టవు .. కేజిఎఫ్ , సలార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది .. స‌లార్ లో  అయితే ప్రభాస్ పక్కన హీరోయిన్ అసలు లేదు .. ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండటం లేదు .. ఈ మూవీలో రుక్మిణీ వ‌సంత‌న్ హీరోయిన్గా తీసుకున్నారు .  అయితే ఈ బ్యూటీ ది రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్ కాదు .. పద్ధతి సంప్రదాయం తెలిసిన క్యారెక్టర్ లో నటిస్తుంది. డ్రాగన్ లో కూడా ఈ టైప్ క్యారెక్టర్ లోని చేస్తుందట ..


 ప్రధానంగా ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానులు డాన్స్ రొమాన్స్ గట్టిగా కోరుకుంటారు .. వాళ్ల కోసమైనా ఈ సినిమాల్లో ప్రశాంత్ ఐటెం సాంగ్ ఒకటి పెడతారని భావించారు .. ప్రధానంగా ఈ సినిమాల్లో శృతిహాసన్ ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది అన్న ప్రచారం కూడా నడుస్తుంది .. అలాగే రీసెంట్గా ర‌ష్మిక మంద‌న్నాని కూడా ఈ సినిమాల్లో తీసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి .. అయితే ఈ రెండు వార్తల్లోను ఏ మాత్రం నిజం లేదని తెలిసిపోయింది .  ఎప్పటిలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా యాక్షన్ ఓరియెంటెడ్ గా తీసుకురాబోతున్నాడు ..


 మహిళా పాత్రలు చాలా తక్కువ కనిపిస్తాయని , రుక్మిణీ వ‌సంత‌న్  పాత్ర కూడా ఎంతో పద్ధతిగా తక్కువ ర‌న్‌ టైంలోనే ఉంటుందని ఇన్సైడ్ వర్గాల టాక్ ..ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు .. మే 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది .. ఈ ఆగస్టులో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే .. ఇలా ఈ సినిమా రిలీజ్ అయిన సరిగా తొమ్మిది నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ నటించిన మరో సినిమా అనగా ప్రశాంత్ నీల్‌ , ఎన్టీఆర్ మూవీ 2026 జూన్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: