ఏంటి రణబీర్ కపూర్ తో ఆ పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిజంగానే డేటింగ్ చేస్తుందా.. ఇంతకీ రణబీర్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్న ఇప్పటి తరం హీరోగా రణబీర్ కపూర్ ను చెప్పుకుంటారు. ఈయన 10 కి పైగా హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే అలాంటి రణబీర్ కపూర్ తనకంటే వయసులో పెద్దదైన హీరోయిన్ తో కూడా ఎఫైర్ పెట్టుకున్నట్టు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి మూవీ హీరోయిన్ అమీషా పటేల్.. రణబీర్ కపూర్,అమీషా పటేల్ ఆ మధ్యకాలంలో ఎక్కువగా పార్టీలు, పబ్బులు అంటూ తిరిగేవారు. దాంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. 

అంతేకాదు రన్బీర్ కపూర్ కి చెందిన ఆర్కే బంగ్లాలో తరచూ అమీషా పటేల్ కనిపించడంతో రన్బీర్ కపూర్, అమీషా పటేల్ డేటింగ్ నిజమేనని చాలామంది అనుకున్నారు. అయితే ఇంకొంత మందేమో రన్బీర్  కపూర్ కి ఇదేం పోయేకాలం తనకంటే వయసులో అన్ని సంవత్సరాలు పెద్దదైన హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారు అని కూడా తిట్టుకున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ తన డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అమీషా పటేల్ మాట్లాడుతూ.. నాకు చాలామందితో ఎఫైర్స్ అంట గట్టారు. ముఖ్యంగా రన్బీర్ కపూర్ తో కూడా నాకు ఎఫైర్ ఉన్నట్టు వార్తలు రాశారు. కానీ రణబీర్ కపూర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మేమిద్దరం సాన్నిహిత్యంగా ఉండడం వల్లే ఈ వార్తలు వినిపించాయి.

 నేను రణబీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంకా బీటౌన్ లో ఉన్న కొంతమంది నటీనటులు కలిసి ఇండస్ట్రీ లో హై ప్రొఫైల్ పార్టీలకు వెళ్లే వాళ్ళం. అలా తరచూ కలిసి కనిపించేసరికి ఈ డేటింగ్ వార్తలు వినిపించాయి కావచ్చు. అలాగే రన్బీర్ కపూర్ కి చెందిన ఆర్కే బంగ్లా కి కూడా నేను తరచు వెళ్ళేదాన్ని.అయితే ఆ బంగ్లా కి వెళ్లి మేము సినిమాలు చూసే వాళ్ళం అంతే..అంతకుమించి ఏమీ లేదు అంటూ రన్బీర్ కపూర్ తో వచ్చిన డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అమీషా పటేల్. ఇక పెళ్లి కాకుండానే అమీషా పటేల్  ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు తగ్గట్టు అమీషా పటేల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ లో ఆమె బేబీ బంప్ కనిపించడంతో అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: