తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లుగా పరిచయమవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి కీర్తి సురేష్ ఒకరు. ఈ భామ నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది మహానటి సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. 

తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాలలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ చిన్నది కొద్ది రోజుల క్రితమే "బేబీ జాన్" సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం హిందీలోను వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఇక కీర్తి సురేష్ రీసెంట్ గానే తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. చాలా సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో మరో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రాజ్ కుమార్ రావు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని అందుకున్నారట. ఇక జూన్ 1వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా షూటింగ్లను ముంబైలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కీర్తి సురేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: