యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... తెలంట్డ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీలోని దాదాపు అన్ని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా తారక్ , జాన్వీ కపూర్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అయినటువంటి చుట్ట మల్లే సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్లో తారక్ , జాన్వి ఇద్దరు కూడా పోటీ పడి తమ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక జాన్వి ఈ సాంగ్లో తన డాన్స్ తో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సాంగ్ కి బోస్కో కొరియోగ్రఫీ చేశాడు. తాజాగా ఈ కొరియో గ్రాఫర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ సాంగ్ విషయంలో తనకు ఎదురైన ఓ అనుభవం గురించి ఆయన చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా బోస్కో మాట్లాడుతూ ... దేవర మూవీలోని చుట్ట మల్లే సాంగ్ కొరియో గ్రఫీ విషయంలో నాకు సరైన గుర్తింపు లభించలేదు. కనీసం ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో జాన్వీ అయినా ఈ పాట గురించి మాట్లాడుతుందని అనుకున్నాను.

కానీ అలా కూడా అస్సలు జరగలేదు. వాళ్లు గుర్తించినందుకు పర్వాలేదు. వాళ్లు మనల్ని గుర్తించనప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలి. మనకు క్రెడిట్ ఇవ్వాలని వాళ్ళని బలవంతం చేయలేం కదా. అందుకే ఏ పాటనైనా కొరియోగ్రఫీ చేసిందేవరో ప్రేక్షకులకు తెలిసేలా ఓ ప్రొటోకాల్ ఉండాలి' అని ప్రముఖ కొరియో గ్రాఫర్ అయినటువంటి బోస్కో తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: