అడివి శేష్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరు. ఈయన ఏ సినిమా తీసిన దానికి ప్రేక్షకులు ఆకర్షితులు అయిపోతారు. అడివి శేష్ తీసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ క్రేజ్ మాత్రం బాగానే ఉంది. ఈయన ప్రతి సారి డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులకు ముందుకి వస్తారు.. హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అయితే ఈయన మరోసారి అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అడవి శేషు డకాయిట్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామరస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి క్షణం, గూడచారి సినిమాలకు కెమెరా మెన్ గా చేసిన షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

డకాయిట్ మూవీ తెలుగుతో పాటుగా హిందీ భాషలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య జరిగే కథ. వారిద్దరూ వారి జీవితాలను మార్చుకోవడం కోసం చేసే దోపిడీల ఆధారంగా రూపొందించింది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. దీంతో అడివి శేష్ క్రిస్మస్ బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ పై నటి రేణు దేశాయ్ స్పందించింది. తను ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో 'శేష్.. ఏంటి ఇదంతా... అదరగొట్టేశావు... డకాయిట్ మూవీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను' అంటూ పోస్ట్ పెట్టింది.
 
ఆ పోస్ట్ కి అడవి శేష్ స్పందిస్తూ.. థాంక్యూ రేణు అని రిప్లై ఇచ్చారు. ఇక ఈ సంభాషణ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ అడివి శేష్, రేణు దేశాయిని రేణు అని పిలవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే కొంతకాలం కిందట శేష్, రేణు దేశాయ్ కి మధ్య ఏముంది అంటూ వరుసగా వార్తలు వస్తూ ఉండేవి. ఆ పోస్ట్ లకు రేణు దేశాయ్ అకిరా, శేష్ ఇద్దరు సోదరులు లాంటివాళ్ళు. అకిరాకు శేష్ అన్నలాంటి వాడని సమాధానం చెప్పి అందరి నోర్లు ముగించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: