మెగా హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన సత్తాను చాటుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాజకీయాలలో ఎప్పుడు బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ సినిమాలలోనూ ఇప్పటికీ నటిస్తుండడం విశేషం. గతంలో తాను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కి కాబోయే భార్య శిరీష ఓ కీలక పాత్రలో నటించే అవకాశాన్ని కొట్టేసిందని గత కొంత కాలం నుంచి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయం పైన నారా రోహిత్ స్పందించారు. రీసెంట్ గా నారా రోహిత్ మాట్లాడుతూ ఓజీ సినిమాలో శిరీష కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అప్ కమింగ్ మూవీ భైరవం ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని శిరీష అందుకోవడంతో తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. తాను నటించే సినిమాలన్నీ ప్రస్తుతం పెండింగ్ లో పడ్డాయి. తనకు సమయం దొరికినప్పుడల్లా ఆ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలకు పైనే ఉండడం విశేషం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: