ఆర్య, ఆర్య2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలతో సుకుమార్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఎవరూ ఊహించలేని వింతైన సబ్జెక్ట్ లతో ఈ దర్శకుడు ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆర్య2 సినిమాకు సీక్వెల్ గా ఆర్య3 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
 
అల్లు అర్జున్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ దృష్ట్యా ప్రస్తుతం ఆర్య3 సినిమాను ఈ హీరో చేసే పరిస్థితి అయితే లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అశిష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుండగా సుకుమార్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించనున్నారని తెలుస్తోంది. ఆర్య3 సినిమా ఆసక్తికర ట్విస్టులతో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
ఆర్య3 సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆర్య3 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆర్య3 సినిమాలో కథనం మరింత కొత్తగా ఉండనుందని సెకండాఫ్ విషయంలో సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆర్య3 సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
 
దిల్ రాజు అశిష్ ను హీరోగా నిలబెట్టడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అశిష్ ఆ పాత్రకు ఎంతమేర సూట్ అవుతారనే ప్రశ్నలు సైతం వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఆర్య3 సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఆర్య3 హిట్టైతే ఇతర హీరోలతో హిట్ సినిమాల సీక్వెల్స్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్య3 సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: