జూన్ నెల మొదటి వారంలో అత్యంత భారీ అంచనాలతో థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కాగా విడుదలకు ముందే పలు వివాదాల ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కర్ణాటక రాష్ట్రంలో ఒక్క థియేటర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. మణిరత్నం ఈ సినిమాకు దర్శకుడు కాగా కమల్ మణిరత్నం కాంబో ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.
 
శింబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా త్రిష హీరోయిన్ గా నటించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కింది. ఫస్టాఫ్ బాగానే ఉందని కమల్, శింబు యాక్టింగ్ తో మెప్పిస్తే ఏఆర్ రెహమాన్ బీజీఎంతో అదరగొట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీన్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని ఈ సీన్ పైసా వసూల్ సీన్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
 
కమల్ హాసన్ నాయగన్ తరహా లుక్స్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.. సెకండాఫ్ మాత్రం కొంతమేర రొటీన్ గా ఉందని కథ, కథనం ఊహించే విధంగా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సినిమా బాగుందని ఫ్యాన్స్ చెబుతుండగా అదే సమయంలో మరీ అద్భుతం అని అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు.
 
తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కాగా మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ బాగున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో సాధారణ టికెట్ రేట్లతో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: