తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఈయన శర్వానంద్ , అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన గమ్యం అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని దర్శకుడిగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను పొందాడు. ఆ తర్వాత కూడా ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరో గా నీది అగర్వాల్ హీరోయిన్ గా ఏ ఏం రత్నం బ్యానర్లో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అనేక కారణాల వల్ల చాలా డిలే అవుతూ వచ్చింది. దానితో క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి ఏ ఏం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఏ ఏం రత్నం మాట్లాడుతూ త్వరలోనే క్రిష్ కి సినిమా చూపించబోతున్నాం.

ఆయన సినిమా చూశాక షాక్ అవుతాడు. దానికి ప్రధాన కారణం ఆయన మాకు చెప్పిన దానికి మేము తీసిన దానికి చాలా తేడా ఉంది. ఆయన చెప్పిన దానికి మేము తీసిన దానికి అత్యంత మార్పులు , చేర్పులు జరిగాయి. ఆ సినిమా సూపర్ గా వచ్చింది. అది చూసి క్రిష్ కచ్చితంగా షాక్ అవుతాడు అని ఆయన కామెంట్స్ చేశాడు. తాజాగా ఏ ఏం రత్నం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: