కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలి అంటే ఏదైనా ఒక సినిమాకు దర్శకత్వం వహించి అది మంచి విజయం సాధిస్తేనే వారికి మంచి గుర్తింపు వస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం కాలం మారింది. అనేక మంది కేవలం సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకొని దర్శకులుగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం కాకుండా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కి , వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించి వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలను చేసే అవకాశాలను దక్కించుకుంటున్నారు.

అలాంటి వారిలో ఆదిత్య హాసన్ ఒకరు. ఈయన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ పెద్దగా అంచనాలు లేకుండా ఈ టీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను పొందింది. దానితో ఆదిత్య హాసన్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈయనకు అనేక మంది మంచి క్రేజ్ కలిగిన హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని స్టార్ట్ చేశాడు.

ఈ దర్శకుడి తదుపరి మూవీలో మంచి క్రేజ్ కలిగిన నటుడు అయినటువంటి ఆనందు దేవరకొండ హీరోగా కనిపించనుండగా , మంచి క్రేజ్ కలిగిన బ్యాటీలలో ఒకరు అయినటువంటి వైష్ణవి చైతన్య హీరోయిన్గా కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య కాంబోలో గతంలో బేబీ అనే మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దానితో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , ఆదిత్య హసన్ కాంబోలో రూపొందబోయే సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ah