అయిపోయింది.. ఇన్నాళ్లు గద్దర్ అవార్డ్స్.. గద్దర్ అవార్డ్స్ ..గద్దర్ అవార్డ్స్ అన్నారు. ఎట్టకేలకు అది కంప్లీట్ అయిపోయింది.  నిన్న రాత్రి హైదరాబాద్లోని హైటెక్ సిటీస్ లో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకను చాలా చక్కగా నిర్వహించారు. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మరీ ముఖ్యంగా మణిరత్నం .. సుహాసిని.. మురళీమోహన్ ..జయప్రద ..అల్లు అర్జున్ ..బాలయ్య ..విజయ్ దేవరకొండ ..జయ సుధ.. రీతూ వర్మ ..నివేదా థామస్ ..అనన్య నాగళ్ళ..ఫరియా అబ్దుల్లా తదితరులు ఈవెంట్లో పాల్గొన్నారు.


విన్నర్స్ అవార్డు తీసుకొని ఈ వేడుకను ఈవెంట్ ను చాలా స్పెషల్ గా మార్చేశారు. అయితే ఉత్తమ నటుడుగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు అందుకున్న తర్వాత ఓ డైలాగ్ చెప్తాడు . ఆ డైలాగ్ హైలెట్ గా మారింది. పుష్ప2  సినిమాలోని డైలాగ్ తనదైన యాసలో చెప్పి అదరగొట్టేసాడు బన్నీ.  స్టేజిపై ఉన్న రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ఆ డైలాగ్ చెప్పడం ఇంకా హైలెట్ గా మారింది. ఓరేయ్..ఆ బిడ్డమీద ఒక్క గీటు పడ్డ ...ఆ గంగమ్మ జాతరలో యాట తలనరికినట్టు ..రఫ్ఫా రఫ్ఫా నరుకుతా ఒక్కొక్కడిని నా కొడకల్లారా. పుష్ప, పుష్పరాజ్‌ అస్సలు తగ్గేదెలే అంటూ మాస్‌ డైలాగ్‌ చెప్పి అంద‌రిని అల‌రించారు.".  బ‌న్నీ డైలాగ్‌కి స్టేజ్ మీద ఉన్న వారితో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు.

అయితే ఇంకొంచెం డేరింగ్ స్టెప్ వేసి అల్లు అర్జున్ స్టేజ్ పై పుష్ప సినిమాలోని సాంగ్ కి డాన్స్ చేసి ఉంటే మాత్రం ఈవెంట్ మరింత హైలెట్గా మారుండేది అని .. అది ఎప్పటికీ అల్లు అర్జున్ కి అలాగే గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో చరిత్రలో నిలిచిపోయి ఉండేది అని బన్నీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ -  రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న విధానం బిహేవ్ చేసిన పద్ధతి అందరికీ బాగా నచ్చేసింది.  ఇక అల్ ప్రాబ్లం సాల్వ్ బన్నీకి అన్ని హ్యాపీడేసే అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఓ రేంజ్ లో ఖుషి అయిపోతున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: