వైట్ కలర్ ట్రెండీ దుస్తులు ధరించి బీచ్ లో చిల్ అవుతున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఆమె టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సతీమణి.. నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు తబిత హంసిని. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్యగా ఇండస్ట్రీలో తబిత గుర్తింపు సంపాదించుకున్నారు. భర్త హోమ్ బ్యాన‌ర్ సుకుమార్ రైటింగ్స్ ను త‌బిత‌నే చూసుకుంటున్నారు.


సుకుమార్‌, త‌బిత ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో `ఆర్య` సినిమా స్క్రినింగ్ టైమ్‌లో సుకుమార్ తొలిసారి తబితను కలిశారు. వీరి ప‌రిచ‌యం స్నేహంగా, ఆపై ప్రేమ‌గా మారింది. నాలుగేళ్ల ప్రేమించుకున్న ఈ జంట‌.. పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే సుకుమార్ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వాడు కావ‌డంతో అత‌నితో పెళ్లికి త‌బిత త‌ల్లిదండ్రులు మొద‌ట అంగీక‌రించ‌లేదు.
ఆ త‌ర్వాత త‌బిత ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఒకే చెప్పారు. 2009లో పెద్ద‌ల స‌మ‌క్షంలో సుకుమార్‌, తబిత వివాహం చేసుకున్నారు. ఈ జంట‌కు సుకృతి వేణి అనే కుమార్తె, సుక్రాంత్ అనే కుమారుడు జ‌న్మించాడు. సుకృతి ఇప్ప‌టికే `గాంధీ తాతా చెట్టు` సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టింది. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. సుకృతి మాత్రం త‌న నటనతో విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది.


ఇక‌పోతే సుకుమార్‌, త‌బిత జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇటీవ‌ల 16 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే సుకుమార్ ఫ్యామిలీ బాలికి వెకేష‌న్ వెళ్లారు. అక్క‌డ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌నే తాజాగా త‌బిత సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: