మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రానా, బన్నీ ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారని నేను కూడా ఒకప్పుడు అందులో ఉండేవాడినని వెల్లడించారు. ఆ గ్రూప్ లో హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారని మంచు విష్ణు తెలిపారు. ఆ గ్రూప్ లో చాట్ చేయాలంటే బిడియంగా అనిపించేదని విష్ణు పేర్కొన్నారు. ఆ గ్రూప్ నుండి లెఫ్ట్ అయ్యానని వెల్లడించారు.

మరోవైపు కన్నప్ప ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా ఈ సినిమాకు సంబంధించిన వివాదాలన్నీ  తొలగిపోయాయి.  ప్రభాస్ ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయిందని  చెప్పవచ్చు. కన్నప్ప సినిమాకు హిట్ టాక్ వస్తే  700 నుంచి 800 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే ఛాన్స్  ఉంది.  కన్నప్ప క్లైమాక్స్ అద్భుతంగా ఉండనుందని  సినిమాలో ట్విస్టులు సైతం  ఆసక్తికరంగా ఉంటాయని  తెలుస్తోంది. ప్రభాస్ పాత్రకు అభిమానులకు గూస్ బంప్స్ రావడం  పక్కా అని చెప్పవచ్చు.

ప్రభాస్ పాత్ర డైలాగ్స్  సైతం అద్భుతంగా ఉన్నాయని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.   కన్నప్ప సినిమా  ఇతర భాషల్లో  సైతం  సంచలనాలు సృష్టిస్తుందని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. గతేడాది కల్కి సినిమా జూన్ 27వ తేదీన విడుదల కాగా  ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ  ఈ ఏడాది  కన్నప్ప విడుదల అవుతోంది.

ఈ రెండు సినిమాల ఫస్ట్ లెటర్ క అనే సంగతి తెలిసిందే.  ఇప్పటివరకు ఈ సినిమా నుంచి  వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను  ఎంతగానో  ఆకట్టుకున్నాయి.   ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.  ఏడాదికి ఒకటి లేదా  రెండు సినిమాలు  విడుదలయ్యేలా  ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ ఉంది.  కన్నప్ప విజువల్ ఎఫెక్ట్స్  కూడా ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: