కొన్ని సంవత్సరాల క్రితం రాజ్ తరుణ్ హీరో గా హెబ్బా పటేల్ హీరోయిన్గా పల్నాటి సూర్య ప్రతాప్ దశకత్వంలో కుమారి 21 F అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. ఈ మూవీ కి సుకుమార్ కథను అందించాడు. 2015 వ సంవత్సరం విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు పెద్ద ఎత్తున రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి. ఇకపోతే తాజాగా కుమారి 21 F సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను జూలై 10 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా 2015 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపిస్తుందేమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ , హెబ్బా పటేల్ కు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: