
ప్రియమైన వారికోసం అన్ని ఇచ్చేశానంటూ ఆ పోస్టులో తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యుల వల్ల అభిషేక్ ఇలాంటి పోస్ట్ చేశారంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. గత కొంతకాలంగా ఐశ్వర్యారాయ్ నుంచి అభిషేక్ విడిపోతున్నారని విషయం వైరల్ గా మారడనికి ఈ పోస్టు మరింత బీజం వేసినట్లుగా కనిపిస్తోందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ తన ఇంస్టాగ్రామ్ లో ప్రతిరోజు ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే.. అంతర్గతంగా ఆనందం గురించి కూడా ఆలోచించడం చాలా కీలకమే అన్నట్టుగా తెలిపారు.
అంతేకాకుండా తాను మరొకసారి ఒంటరిగా ఉండాలని ఉంది అంటూ.. నాకోసం నేను కొంత సమయాన్ని కేటాయించుకోవాలనిపిస్తోంది అన్నట్టుగా తెలిపారు. దీంతో అభిషేక్ బచ్చన్ పోస్ట్ పైన చేస్తున్నారు.. ఒక మిస్ ఇండియా ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే అందుకు అర్థం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు? మరొక నేటిజన్ భార్య పిల్లలతో కొంత సమయాన్ని గడపండి మళ్లీ రీసెట్ అవుతారు అంటూ సలహా ఇస్తున్నారు.. సుమారుగా 17 ఏళ్ల క్రితం అభిషేక్, ఐశ్వర్యరాయ్ ప్రేమించి మరి వివాహం చేసి వీరికి ఆరాధ్య అని కూతురు కూడా జన్మించింది. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని వార్తలకు చెక్ పెట్టకుండా మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తూ ఉండడంతో తెరమీద మళ్ళీ విడాకులు పంచాయితీ వినిపిస్తోంది.