
సునీల్ నారంగ్ కుమార్తె జాహ్నవీ నిర్మాతగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఆమె ప్రియదర్శితో సినిమాను నిర్మిస్తుంది . టాలీవుడ్ ప్రముఖచిత్ర నిర్మాత ఆసియన్ సునీల్ నారంగ్ కుమార్తె ఈ జాహ్నవీ నారంగ్. ఆమె పరిశ్రమ వర్గాలలో చాలా చురుకైన వ్యక్తిగా పేరు సంపాదించుకుంది . కాగా అలాంటి జాహ్నవీ నారంగ్ తో చిరంజీవి ఓ సినిమా చేస్తాను అంటూ స్టేజి పైనే ప్రకటించేశాడు. ఆయన మాట్లాడుతూ.." జాహ్నవి నారంగ్ తో సినిమా చేస్తా . అయితే అది మాత్రం కుబేర లాంటి సీరియస్ కంటెంట్ కాకూడదు తనదైన ఎంటర్టైన్మెంట్ తో ఉంటే బాగుంటుంది . అలాంటి ప్రాజెక్ట్ అయితే కచ్చితంగా ఆమె నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది " అంటూ చిరంజీవి స్టేజ్ పైనే చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో జాహ్నవి నారంగ్ పేరు మారుమ్రోగి పోతుంది.
నిర్మాతగా తక్కువ కాలంలోనే వెలుగులోకి రావాలి అంటే కచ్చితంగా ఒక పెద్ద స్టార్ తో సినిమా పడాలి . అలా పడితే మాత్రం నో డౌట్ ఆ ప్రొడ్యూసర్ ఇక స్టార్ అయిపోయినట్లే . ప్రెసెంట్ ప్రియదర్శితో సోలో నిర్మాతగా జాహ్నవి ఓ సినిమా చేస్తుంది . ఒకవేళ చిరు సినిమా ఓకే అయితే మాత్రం నిర్మాతగా జాహ్నవీ ప్రయాణం వెరే లేవల్ కి వెళ్ళిపోవడం ఖాయం . అందులో నో డౌట్ . జాహ్నవి తండ్రి సపోర్ట్ ఆమెకి ఎలాగో ఉంటుంది . ఇక ఇండస్ట్రీ నుంచి పెద్దల సహాయ సహకారాలు కూడా అందుకుంటుంది. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్లో సినిమా సెట్ కావడం పెద్ద విషయం కాదు పెద్ద ఆలస్యం కాదు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జాణ్నవి నారంగ్ పేరు మారుమ్రోగి పోతుంది. చిరంజీవి ఇలా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ళు ఓకే చేస్తే బాగుంటుంది అంటున్నారు మెగా అభిమానులు..!