
అయితే ఇక్కడ మహేష్ సినిమా అయ్యాక ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి .. అయితే రాజమౌళి ఆలస్యం చేసేసరికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ లైన్ లోకి వచ్చేసారు .. తన టీం తో కలిసి భారీ స్థాయిలో మహాభారతం సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు .. రాజమౌళి చేయబోతున్నప్పుడు .. అమీర్ ఈ ప్రయత్నం చేయటం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఇంతలో మహాభారతాన్ని భారీ స్థాయిలో సినిమాగా తీయడానికి మరో దర్శకుడు కూడా సై అంటున్నాడు .. ఇంతకి ఆయన మరెవరో కాదు .. కన్నప్ప సినిమా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ .. ఈయన హిందీలో మహాభారతం సీరియల్ ను భారీ స్థాయిలో తెర్కక్కించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించారు ..
సీరియల్ అయినా సరే మహాభారతం మీద ఏకంగా 200 కోట్లు బడ్జెట్ పెట్టారంటే దాని రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .. దేశంలో ఏ సీరియల్ డైరెక్టర్ కి రాని పేరు క్రేజ్ ముఖేష్ కు వచ్చింది .. అందులో పనితనం నచ్చే కన్నప్ప సినిమాకు ఆయన్ని దర్శకుడుగా తీసుకున్నారు మోహన్ బాబు , మంచు విష్ణు .. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ ముఖేష్ .. మహాభారతం ను సినిమాగా కూడా తీసుకురాబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు .. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని .. కన్నప్ప రిలీజ్ తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని ముకేశ్ చెప్పకు వచ్చారు .. ఇక ముందు అమీర్ ఇప్పుడు ముఖేష్ .. ఇలా ఒకరి తర్వాత ఒకరు మహాభారతం సినిమాలపై అనౌన్సులు చేస్తున్నారు .. మరి రాజమౌళి ఎప్పుడు సినిమాను ప్రకటిస్తాడో చూడాలి ..