దత్తత తీసుకున్న అమ్మాయినే కట్టప్ప పెళ్లి చేసుకున్నారా..ఇంతకీ ఇందులో ఉన్న నిజం ఎంత.. అసలు ఈ విషయాన్ని తెరమీదకి తీసుకువచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్లిన సమయంలో హిందుత్వం గురించి మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనపై బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్.. పవన్ కళ్యాణ్ తమిళనాడులో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టడం అనేది అంత సులువు కాదు. తమిళనాడు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. ఇలాంటి మత రాజకీయాలు ఇక్కడ చేయవు అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చారు.

అయితే సత్యరాజ్ అంత ఘాటుగా పవన్ కళ్యాణ్ పై కౌంటర్ ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సత్యరాజ్ కి కౌంటర్ ఇవ్వలేకపోయారు.. డిప్యూటీ సీఎం హోదాలో సినీ ఇండస్ట్రీలో పేరున్న పవన్ కళ్యాణ్ కి ఒక విధంగా అవమానమే అని చెప్పవచ్చు. సత్యరాజ్ కౌంటర్ ఇస్తే కనీసం ఇండస్ట్రీలో ఉన్న ఎవరూ కూడా స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఎవరూ లేకపోయినా మేమున్నాం మా అన్నకు అండదండగా అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో సత్యరాజ్ ని ఏకీపారేస్తున్నారు. ముఖ్యంగా ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది. 

ఆ నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో సత్యరాజ్ ని ఉద్దేశిస్తూ దత్తత తీసుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నావ్ ఇదేనా నువ్వు నమ్మే సిద్ధాంతం అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదేంటి ఆ వ్యక్తి సత్య రాజ్ పై అలాంటి పోస్ట్ పెట్టారు.. ఇది నిజమేనా.. అని తెలియని వాళ్ళు కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో సత్యరాజ్ కి కౌంటర్ ఇచ్చిన ఇచ్చేలా ఆ నెటిజన్ పోస్ట్ పెట్టారని పెరుమాళ్ సిద్ధాంతం అని చెప్పుకునే సత్య రాజ్ కి పవన్ కళ్యాణ్ అభిమాని ఇచ్చిన ఘాటు కౌంటర్ అంటూ ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని తెగ వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: