
సప్తమి గౌడ బెంగళూరులో 1996 జూన్ 8న జన్మించింది. ఆమె తండ్రి ఎస్.కె ఉమేష్ గౌడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. తల్లి పేరు శాంత గౌడ గృహిణి. సప్తమి గౌడ చెల్లెలు ఉత్తరే గౌడ వృత్తిరీత్యా స్విమ్మర్. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్న సప్తమి కూడా చెల్లెలు మాదిరే స్విమ్మింగ్ లో తోపు. ఐదేళ్ల వయసు నుంచి స్విమ్మింగ్ లో శిక్షణ పొందిన ఈ వయ్యారి.. 2006 నుంచి 2010 మధ్య రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను తన సొంతం చేసుకుంది.
2020లో `పాప్ కార్న్ మంకీ టైగర్` అనే కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సప్తమి గౌడ.. 2022లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ `కాంతారా`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రెండో సినిమాతోనే రూ. 450 కోట్లు రాబట్టిందీ బ్యూటీ. ఆ తర్వాత కన్నడలో బిజీ యాక్ట్రస్‌గా మారింది. ఈ ఏడాది `తమ్ముడు` చిత్రంలో టాలీవుడ్ లోనే డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంది. ఒకవేళ తమ్ముడు బాక్సాఫీస్ హిట్‌గా నిలిస్తే తెలుగులో సప్తమికి మరిన్ని ఛాన్సులు తలుపు తట్టడం ఖాయమే. కాగా, ప్రస్తుతం సప్తమి గౌడ తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది.