ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలు తమ సినిమాలకు A  సర్టిఫికెట్ కావాలని సెన్సార్ బోర్డ్ సభలను గట్టిగా అడుగుతున్నారా ? అలాగే తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరి అందుకుంటున్నారా ? అదేంటి A వస్తే వాళ్లకే కదా నష్టం అంటారు కదా .. ఇందులో కూడా బిజినెస్ స్ట్రాటజీ ఉంది .  తాజాగా మరో సినిమాకు A సర్టిఫికేట్ వచ్చింది దానికి నయా బిజినెస్ ట్రెండ్ తో భారీగా అమ్ముడుపోయింది .. అందుకు కారణాలు ఏమిటో అనేది ఈ స్టోరీలో చూద్దాం .. A సర్టిఫికెట్ సినిమాల టైం ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తుంది .. అలాగే పెద్దలకు మాత్రమే అన్ని సెన్సార్ సభ్యులు చెబుతున్న థియేటర్స్ మాత్రం పిల్ల , పెద్దలతో అందరూ కలిసి వచ్చేస్తున్నారు .. గత కొన్ని నెలలుగా అడల్ట్ ఓన్లీ అని సెన్సార్ బోర్డ్ చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం వస్తున్నాయి ..
 

వందల కోట్లు వసూలు చేసిన యానిమల్ , సలార్ .. మంచి హిట్ అయిన హిట్ 3 లాంటి సినిమాలకు వచ్చింది కూడా A సర్టిఫికెట్‌ .. ఒక సినిమాకు A సర్టిఫికెట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది అదే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది .. సలార్ , య‌నిమల్ మాత్రమే కాదు రెండేళ్ల కిందట వచ్చిన బేబీ కూడా A సర్టిఫికెట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసింది .. అలాగే రీసెంట్ గానే శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు సైతం A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ .  ఇది కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుని కలెక్షన్లు కురిపించింది ..ఇక ఇప్పుడు తాజాగా నితిన్ తమ్ముడు సినిమాకు కూడా సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది .. అభ్యంతర డైలాగ్స్ మితిమీరిన హింస, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే A సర్టిఫికెట్ జారీ చేస్తుంది సెన్సార్ బోర్డు ..


అయితే తమ్ముడులో రొమాన్స్ ఉండకపోవచ్చు గాని యాక్షన్ బ్లాక్ గట్టిగానే ఉండబోతుంది .. అలాగే హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు A సర్టిఫికెట్ తీసుకున్నారని తెలుస్తుంది .. ఇక మరి ఈ మూవీ జూలై 4 అనగా రేపు ప్రేక్షకులు ముందుకు రాబోతుంది . ఇక గతంలో A సర్టిఫికెట్ అంటే ఎంతో భయపడిన‌ నిర్మాతలు ఇప్పుడు మాత్రం అదే కావాలని దాన్ని తీసుకుంటున్నారు .. దీని కారణంగా ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తున్నాయి .. అలాగే A అంటే అన్నిసార్లు రొమాన్స్ మాత్రమే కాదు కొన్నిసార్లు సెన్సిబుల్ కంటెంట్ కు కూడా ఇది వస్తుంది .. తమ్ముడు ఈ జాబితాలోకి వచ్చే మూవీ .  అలాగే ఈ రీసెంట్ టైంలో టాలీవుడ్ లో A సర్టిఫికెట్ సినిమాలు మాత్రం బాగానే అదరగొడుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: