- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాలకృష్ణ కెరీర్ లో ప‌లు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. తెలుగు తెర‌పై మొట్టమొదట 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమాగా బాలయ్య నరసింహనాయుడు రికార్డులకి ఎక్కింది. ఇక పాతిక కోట్లు చూసిన మొదటి సినిమాగా బాలయ్య సమరసింహారెడ్డి నిలిచింది. తెలుగు నాట అత్యధిక స్వర్ణోత్సవ సినిమాల హీరోగాను బాలయ్య రికార్డులకు ఎక్కారు. తాజాగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి రు. 150 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్ కేస‌రి - డాకూ మహారాజ్ వరుసుగా రు. 100 కోట్లు కొల్లగొట్టాయి. సీనియర్ హీరోలలో ఈ అరుదైన రికార్డు బాలయ్యకు మాత్రమే ఉంది. తాజాగా డాకు మహారాజ్ సినిమా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో వరుసగా నాలుగు చిత్రాలు డైరెక్ట్ గా రజితోత్సవం జరుపుకున్న సినిమాగా బాలయ్య రికార్డ్ సాధించారు.


ఒక్క వీర‌సింహారెడ్డి సినిమా మినహాయిస్తే బాలకృష్ణ నటించిన అఖండ - భగవంత్‌ కేసరి - డాకు మహారాజు మూడు సినిమాలు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట లోనే రజితోత్సవాలు జరుపుకోవడం విశేషం. వీర‌ సింహారెడ్డి కూడా ఇదే సెంటర్ లో వంద రోజులు ఆడింది. అఖండ - భగవంత్‌ కేసరి చిలకలూరిపేట లోని రామకృష్ణ థియేటర్లో రజితోత్సవం, ద్విశ‌త దినోత్సవం కూడా జరుపుకున్నాయి. డాకు మహారాజ్ అదే చిలకలూరిపేట లోని వెంకటేశ్వర థియేటర్ లో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇక వీర సింహారెడ్డి సినిమా కూడా అదే చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో వంద రోజులు ఆడింది. వీరా సింహారెడ్డి కర్నూలు జిల్లాలోని ఆలూరు ఎస్ ఎల్ వీ థియేటర్లో 367 రోజులు ప్రదర్శితం అయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: