
ఇప్పుడు ఈ సందేహాలకు స్వయంగా వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. అమెరికాలో జరిగిన తాన మహాసభలకు అతిధిగా వచ్చిన వెంకటేష్ అక్కడ తనను కలిసిన తెలుగు మీడియా వర్గాలకు తాను నటించబోయే సినిమా ప్రాజెక్ట్ వివరాలు తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ ప్రాజెక్ట్ చేసే విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదనీ ఈ మూవీకి సంబంధించి కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అన్నక్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు తాను అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి సీక్వెల్ చేసి ఆలోచన ఉందని. అయితే ఈ మూవీ పట్టాలు ఎక్కడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో అనీల్ రావిడి దర్శకత్వంలో తాను చిరంజీవితో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీలో తనది చాల కీలక పాత్ర అని క్లారిటీ ఇచ్చాడు. ఆతర్వాత మీనాతో కలిసి ‘దృశ్యం 3’ చేయబోతున్న విషయానికి సంబంధించి లీకులు ఇచ్చి తన సినిమాల లిస్టును బయటపెట్టాడు. అంతేకాదు త్వరలో బాలకృష్ణతో కలసి ఒక భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్న విషయం బయటకు చెప్పడంతో వెంకటేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. టాప్ యవుమగ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక్క సినిమా కూడ చేయలేని పరిస్థితులలో కొనసాగుతూ ఉంటే వెంకటేష్ వరసపెట్టి ఇలా సినిమాలు చేయడం ఏవైకనా ఆసహర్యాంకలిగించే విషయం అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు..