
బాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడిగా స్టార్ హీరో రణ్బీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి .. మండోదరిగా కాజల్ ..రావణుడిగా యాష్ నటించబోతున్నారు . సన్నీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు . కాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బి అమితాబచ్చన్ కూడా భాగం కాబోతున్నారట. అయితే ఈ సినిమాలో ఆయన ప్రత్యక్షంగా కనిపించడు కానీ ఆయన వాయిస్ మాత్రమే వినిపిస్తుందట .
బిగ్ బి జటాయుకీ తన గొంతు అందించబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే చాలామంది జనాలు "రామాయణ" లాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్టులో ఏదో ఒక పాత్ర కోసం అమితాబచ్చ్న్ ని చూస్ చేసుకుని ఉంటే బాగుండేది అని .. ఏ పాత్రలో ఆయన నటించిన అచ్చం ఆ దేవుడు దిగివచ్చినట్లే నటించి ఉండేవాడు అని మూవీ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆయనను ఓ స్పెషల్ పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుంది అని బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి మూవీ మేకర్స్ ఈ కామెంట్స్ ని చూసి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి . ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.