
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమా లలో హరిహర వీరమల్లు ముందుగా ఈ నెల 24న థియేరట్ల లోకి వస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 25న రిలీజ్‌కు ఓజీ షెడ్యూల్ అయి ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తాడు. ఇక ఓజీ సినిమాకు తిరుగులేని క్రేజ్ ఉంది. అసలు ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటేనే పవన్ క్రేజ్ .. పవన్ స్టామినా ఎలా ఉన్నాయో తెలుస్తోంది.
సాధారణంగా ఏ సినిమా అయినా ఆంధ్రలో ఒక్కో ఏరియాకు బిజినెస్ చేసేటప్పుడు టోటల్ బిజినెస్ లో ఏ ఏరియాకు ఎంత పర్సంటేజ్ బిజినెస్ ఇవ్వాలో లెక్క ఉంటుంది. ఉదాహరణకు ఓజి ఆంధ్ర టోటల్ రేటు రు . 80 కోట్లు అనుకుంటే విశాఖ 24 పర్సంట్ వంతున రేటు ఫిక్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లెక్కలను పవన్ తన ఓజీ సినిమా తో మార్చేస్తున్నాడు. గట్టి పోటీ వుండడం వల్ల విశాఖ... ఈస్ట్ .. గుంటూరు ఈ మూడు ఏరియాలు రెండు నుంచి మూడు పర్సంట్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఏరియాకు 26 లేదా 27 పర్సంట్ ... ఇక ఈస్ట్ 16 నుంచి 18 పర్సంట్ కు పెంచారని టాక్. అలాగే గుంటూరు కూడా గతం కంటే భారీ రేట్లకు వెళ్లిందంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఓజీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందే చెప్పేందుకు ఇవే నిదర్శనాలు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు