మంచు ఫ్యామిలీ నుంచి విడుదలైన కన్నప్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి చాలామంది విమర్శలు చేశారు. మంచు విష్ణు ఇందులో అద్భుతంగా నటించారు. తమ సొంత బ్యానర్ పైనే ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. జూన్ 22న విడుదలైన ఈ సినిమా ఎంతోమంది ఆకట్టుకుంది. దర్శకుడు ప్రతిభ కూడా ఇందులో ఎంత అద్భుతంగా చూపించారు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాని అదే పనిగా పని కట్టుకొని మరి విమర్శిస్తూ ఉన్నారు.


సినిమా అట్టర్ ఫ్లాప్ అని కన్నప్ప సినిమా బాగా లేదంటు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పైన తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ.. విమర్శ ,సద్విమర్శ ప్రకృతి ,వికృతి అనేవి ఉండనే ఉంటాయి. ఒక గొప్ప పండితుడు ఏమన్నారంటే.. జరిగేదంతా ప్రస్తుతం చూస్తున్నాను గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసో తెలియకో నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఇలా విమర్శించే వారంతా కూడా మీ కర్మను తీసుకువెళ్తారని అర్థము.. అందుకే వారిని ఆశీర్వదించండి అంటూ చెప్పారని తెలియజేశారు.


వారి గురించి తానేమీ మాట్లాడనని వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు మోహన్ బాబు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్ కుమార్, కాజల్, ప్రభాస్, మోహన్ లాల్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తోంది. అలాగే కన్నప్ప చిత్రానికి సంబంధించి ఓటిటి డిల్ కూడా భారీగానే కుదురుతున్నాయి. తెలుగులో అయితే ఇంకా ఓటిటి డీల్ మంచు విష్ణు ఫిక్స్ చేయలేదన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ట్రోలర్లకు సైతం ఇలా కౌంటర్ వేశారు మోహన్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: