తమిళ సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం 96 అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి హీరోగా నటించగా ... ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు లో జాను అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీ లో శర్వానంద్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్గా నటించింది. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ పెద్ద విజయం అందుకోలేదు. 96 తమిళ్ వర్షన్ మొదట ఈ మూవీ యూనిట్ విజయ్ సేతుపతి ని హీరోగా అనుకోలేదట.

మరో బాలీవుడ్ హీరో ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనతో కాకుండా విజయ్ సేతుపతితో ఈ మూవీ ని రూపొందించారట. అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించగా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం మాత్రం ఈయనకు దక్కలేదు. 96 మూవీ యూనిట్ మొదట ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ హీరో గా తీసుకోవాలి అని ఆలోచనకు వచ్చిందట. కాకపోతే ఆయన్ను ఎలా అప్రోచ్ కావాలో తెలియక విజయ్ సేతుపతి ని అప్రోచ్ అయ్యి ఈ మూవీ లో ఆయనను హీరోగా తీసుకున్నారట. అభిషేక్ బచ్చన్ కనక ఈ మూవీ లో నటించి ఉండి ఉంటే ఆయనకు అద్భుతమైన విజయం , సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కి ఉండేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs