మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా బిగ్ క్రేజ్  సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే పుష్ప2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతలో వేసుకున్న ఆయన ..నెక్స్ట్ అట్లీని  చూస్ చేసుకోవడం పై అందరు రకరకాలుగా మాట్లాడుకున్నారు.  బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వం లో తెరకెక్కే  సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు . ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

కాగా ఈ సినిమాలో నలుగురు బ్యూటీస్ ఉన్నారు అన్న న్యూస్ లేటెస్ట్ గా వైరల్ అయింది . అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారట . సుమార్ 4 షేడ్స్ లో మనల్ని నటించి మెప్పించబోతున్నాడట. కాగా  రీసెంట్గా  ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది.  ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ని వాడబోతున్నారట . "మై హీరో.. వీరు అందరివాడు" అంటూ ఒక టైటిల్ ని క్యాప్షన్ ని అనుకున్నారట మూవీ మేకర్స్ .

ఆల్రెడీ చిరంజీవి నటించిన "అందరివాడు" సినిమా ఏ విధమైనటువంటి రిజల్ట్ అందుకుంది అనేది అందరికీ తెలుసు . ఇప్పుడు మరొకసారి అలాంటి టైటిల్ తో  వెళ్తే కచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఊరుకోరు. ఆల్ రెడీ ఫ్యామీలీల మధ్య వార్ కూడా ఉంది. మరి అట్లీ ఎందుకు ఈ టైటిల్ పెట్టడం అంటున్నారు ఫ్యాన్స్.  రామ్ చరణ్ - నాగచైతన్య - మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో అందరికి తెలిసిందే.  అయితే అట్లీసినిమా కథను బేస్ చేసుకుని చాలా ట్రెడిషనల్ గా హుందాగా మై హీరో అందరివాడేలే అని క్యాప్షన్ ని ఫిక్స్ చేశారట . ఇది చిరంజీవి టైటిల్ కి దగ్గరగా ఉండటంతో మళ్ళీ వార్ మొదలవ్వబోతుంది అని అంట మాట్లాడుకుంటున్నారు. కొందరు మానిపోయిన గాయాన్ని మళ్ళి లేపొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు . కొంతమంది పోయి పోయి ఎందుకు ఆ టైటిల్ పెట్టుకున్నావు బన్ని  అంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: