
పవన్ కళ్యాణ్ ధరించిన ఈ లగ్జరీ వాచ్ "EBERHARD" అనే బ్రాండ్ కు చెందినది. దీని ధర రూ.1,85,148 లక్షలు అన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు, నెటిజన్స్ కూడా ఈ వాచ్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా ఈ చిత్రం ఒక పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ, క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కించారు.
బాబీ డియోల్, పూజ పొన్నాడ, అనసూయ, అనుపమ్ ఖేర్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి హరిహర వీరమల్లు చిత్రం మొదటి భాగం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడుతూనే ఉంది. చివరికి ఈనెల 24న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా పైన భారీ కలెక్షన్స్ రాబడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. టికెట్ల రేటు విషయంపై కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి పెంచుకొనే సదుపాయాన్ని కల్పించారు. మరి మొదటి రోజు ఎలాంటి రికార్డులను హరిహర వీరమల్లు చిత్రం రాబడుతుందొ చూడాలి మరి. హరిహర వీరమల్లు రెండవ భాగం కూడా ఉన్నది.