
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాష్ రాజ్ ఫిలింస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయాన్ గతంలో ‘యేహ్ జవానీ హై దివానీ’, ‘బ్రహ్మాస్త్ర’ లాంటి హిట్ సినిమాలు అందించాడు. ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా 'వార్ 2'ను తెరకెక్కిస్తూ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్‌ను షేర్ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. హృతిక్ ఇప్పటికే 'వార్'లో "కబీర్"గా తన మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించగా, ఇప్పుడు ఎన్టీఆర్ పవర్‌ఫుల్ రోల్ లో నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్ విషయాల్లో మరో హాట్ టాపిక్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌లో ఒక మెగా లెవెల్ ప్రాజెక్ట్. ఎన్టీఆర్‌కు రూ.70 కోట్లు, హృతిక్ రోషన్‌కు రూ.50 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ వార్తలు బయటకు రావడంతో సినీ వర్గాల్లో, ఫ్యాన్స్ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ కు హృతిక్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందించడం వెనుక కారణాలు అనేకంగా ఉండొచ్చు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్టార్‌డమ్, పాన్ ఇండియా స్థాయిలో అతడి క్రేజ్ .. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు వచ్చిన గ్లోబల్ గుర్తింపు – ఇవన్నీ కలిసే ఎన్టీఆర్‌కు హృతిక్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కారణమయ్యాయి. వార్ 2 సినిమాను ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు